Hyd Rain | హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్, గాజుల రామారాం, జగద్గిరిగుట్ట, బహదూర్‌పల్లి, సూరారం, సుచిత్ర, గుండ్లపోచంపల్లి, పేట్ బషీరాబాద్, జీడిమెట్ల వర్షం కురుస్తున్నది. బోయినపల్లి, ప్రగతినగర్, బేగంపేట, తిరుమలగిరి, అల్వాల్, మారేడుపల్లి, కూకట్పల్లి, ప్రగతినగర్, హైదర్‌నగర్, బాచుపల్లి, మూసాపేట, సికింద్రాబాద్, కోఠి, మలక్‌పేట తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. యూసఫ్‌గూడ, ఖైరతాబాద్, మెహదీపట్నం, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం నమోదైంది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. వర్షం రోడ్లపై నిలవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.