Hyderabad Rains | హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. హుస్సేన్‌సాగర్, సరూర్‌నగర్ మినీ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వాన పడుతున్నది. ముషీరాబాద్, చిక్కడపల్లి, దోమలగూడ, కవాడిగూడ, భోలక్‌పూర్, గాంధీనగర్, రాంనగర్, అడిక్‌మెట్, అడ్డగుట్ట, మారేడ్‌పల్లి, సీతాఫల్మండి, బోయినపల్లి, ప్రకాశ్‌నగర్, రాణిగంజ్, ప్యారడైజ్, ఉప్పల్, మలక్‌పేట, అంబర్‌పేట, యూఓ క్యాంపస్‌తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో వాహనదారులకు ఇబ్బందులకు గురయ్యారు. వర్షం నేపథ్యంలో వినాయక నిమజ్జన శోభాయాత్రకు ఆటంకం కలుగుతుంది. అయితే, ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో వర్షంలోనూ నిమజ్జనం కొనసాగుతుంది.