హైదరాబాద్ : నగరంలోని పలు చోట్ల ఆదివారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. సికింద్రాబాద్ పరిధిలోని చిలుకలగూడ, బేగంపేట, మారేడుపల్లి, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో వర్షం కరుస్తుండగా.. పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. తూర్పు, విదర్భ పరిసర ప్రాంతాల నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు సముద్రమట్టానికి సుమారు 0.9 కిలోమీటర్ల ఉపరితల ద్రోణి ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పొద్దంతా ఎక్కడలతో జనం ఉక్కపోతతో ఇబ్బంది పడగా.. ఒక్కసారిగా చిరు జల్లులు కురవడంతో జనం వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.