Hyd Rains | హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. బషీర్‌బాగ్, లక్డీకపూల్, లిబర్టీ, నాంపల్లి, లంగర్‌హౌస్, గోల్కొండ, కార్వాన్, జియాగూడ, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట, ఎస్ఆర్నగర్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బోరబండ, సనత్‌నగర్, శేరిలింగంపల్లి, మియాపూర్, మదీనగూడ, చందానగర్‌లో వర్షంపడుతున్నది. లింగంపల్లి, కొండాపూర్, గచ్చిబౌలితో పాటు సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్పల్లి, మారేడ్‌పల్లి, తిరుమలగిరి అల్వాల్, బొల్లారం, ప్యాట్నీ, పార్యడైజ్, చిలుకలగూడ, బేగంపేటతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం పడుతున్నది. వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రోడ్లపై పెద్ద ఎత్తున వాన నీరు నిలిచిపోయింది. పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌తో తెలంగాణవ్యాప్తంగా రాబోయే ఐదురోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.