HYD Rain | హైదరాబాద్‌లోని ఆదివారం సాయంత్రం పలుచోట్ల ఒక్కసారిగా వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్, బహదూర్‌పల్లి, సూరారం, షాపూర్‌నగర్, జీడిమెట్ల, బాలానగర్, జగద్గిరిగుట్ట, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గండిమైసమ్మ, దుండిగల్, సుచిత్రలో వానపడింది. కూకట్పల్లి, హైదర్‌నగర్, జేఎన్టీయూ, మూసాపేట, ప్రగతినగర్, బాచుపల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, ఆల్విన్ కాలనీ, సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, బొల్లారంలో వర్షం కురిసింది. అల్వాల్, ప్యాట్ని, ప్యారడైజ్, బేగంపేట, మారేడ్‌పల్లి, యూసుఫ్‌గూడ, వెంకటగిరి, ఎస్ఆర్నగర్, సనత్‌నగర్, రహమత్‌నగర్, అమీర్‌పేట, ఎర్రగడ్డ, కృష్ణానగర్, మధురానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌తో పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షం పడింది. వర్షంతో ఒక్కసారిగా వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.