Hyderabad | హైదరాబాద్ నగరంలో ఆదివారం సాయంత్రం పలుచోట్ల వర్షం కురుస్తున్నది. హైదరాబాద్ నగరాన్ని భారీ మేఘాలు కమ్మేశాయి. దాంతో పాటు ఈదురుగాలులు సైతం వీస్తున్నాయి. మరో వైపు రాత్రి 8 గంటల వరకు హైదరాబాద్ వ్యాప్తంగా మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రస్తుతం మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కూకట్పల్లి, మూసాపేట, హైదర్‌నగర్, కేపీహెచ్‌బీ, బాచుపల్లి, గాజులరామారం, నిజాంపేట, ప్రగతినగర్, చర్లపల్లి, కీసర, నేరేడ్మెట్, జీడిమెట్ల, కొండాపూర్, అమీర్‌పేటలో వర్షం కురుస్తున్నది. అలాగే, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, బేగంపేట, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్, అల్వాత్తో పాటు పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది.
మల్కాజ్గిరి, కుషాయిగూడ, దమ్మాయిపేట, ఈఎస్ఐ, సనత్‌నగర్, బోరబండ, ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్, మేడిపల్లి, పీర్జాదిగూడ, నాంపల్లి, అబిడ్స్, కోఠి, బషీర్‌భాగ్, నారాయణగూడ, హిమాయత్‌నగర్, లక్డీకపూల్, మేడ్చల్, కృష్ణాపూర్, మల్లంపేట, గండిమైసమ్మ, దుండిగల్, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, గోల్నాక తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. వర్షంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది.