Rain | హైదరాబాద్ నగరంలో సోమవారం రాత్రి పలుచోట్ల వర్షం కురిసింది. భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో పలుచోట్ల వర్షం పడింది. సికింద్రాబాద్, చిలకలగూడ, బేగంపేట, అల్వాల్, బోయిన్పల్లి, తిరుమలగిరి, మారేడ్‌పల్లి, కాప్రా, కుషాయిగూడ, నాగారం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, సనత్‌నగర్‌లోని పలు చోట్ల వర్షం కురిసింది. వర్షంతో పలువురు వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో రాగల ఐదురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది. పలుచోట్ల వడగండ్ల వానలు పడుతాయని చెప్పింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.