Rain in Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈ వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. పలు చోట్ల రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయింది. మరో రెండు గంటల్లో కూడా హైదరాబాద్ నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సోమాజిగూడ, ఖైరతాబాద్, బేగంపేట్, పంజాగుట్ట, కొండాపూర్, మాదాపూర్, మెహిదీపట్నం, బషీర్‌బాగ్, అబిడ్స్, కోఠి, సుల్తాన్ బజార్, బేగంబజార్, హిమాయత్‌నగర్, నారాయణగూడ, లక్డీకాపూల్, బాగ్ అంబర్పేట్, కాచిగూడ, నల్లకుంట, బర్కత్‌పురా, ముషీరాబాద్, విద్యానగర్, రాంనగర్, ఉస్మానియా యూనివర్సిటీ, బాగ్ లింగంపల్లి, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, గాంధీ నగర్, జవహర్ నగర్, కవాడిగూడ, భోలక్‌పూర్, దిల్సుఖ్నగర్, సైదాబాద్, చంపాపేట్, మలక్‌పేట్, మూసారాంబాగ్, చాదర్ఘాట్తో పాటు తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.