సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో గ్రేటర్లో రాగల 24 గంటల్లో అక్కడక్కడా మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ద్రోణి ప్రభావంతో ఎండ తీవ్రత పెద్దగా కనిపించలేదు. ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 32.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 20.5 డిగ్రీలు, గాలిలో తేమ 54 శాతంగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.