Rain Alert | సిటీబ్యూరో, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాగా గత రెండు రోజులుగా నగరంలో రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ఠం 28.7, రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల నుంచి 20.8 డిగ్రీలకు పెరిగాయి. దీంతో రాత్రి సమయంలో చలి తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది.