సిటీబ్యూరో, మే 11 (నమస్తే తెలంగాణ): ద్రోణి ప్రభావంతో గ్రేటర్ పరిధిలోని పలు చోట్ల తేలికపాటి వర్షం కురిసింది. ఆదివారం రాత్రి 9 గంటల వరకు శేరిలింగంపల్లి మండలంలోని హఫీజ్‌పేట లో 1 సెంటీమీటర్, మియాపూర్‌లో 4.5 మి.మీ, మదాపూర్‌లో 2.8 మి.మీ వర్షపాతం నమోదైందని టీజీడీపీఎస్ అధికారులు తెలిపారు.
కాగా ద్రోణి ప్రభావం కొనసాగుతుండటంతో రాగల మరో రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు ్ల హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మరోవైపు ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ 38.9, కనిష్ఠం 27.3 డిగ్రీలు, గాలిలో తేమ 30శాతంగా నమోదైంది.