రైల్వే కోచ్‌లో కిటికీ పక్కన కూర్చుని మాట్లాడుకుంటూ భోజనం చేస్తే.. ఆ అనుభూతే వేరు. ఆహార ప్రియుల కోసం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు నెక్లెస్ రోడ్‌లోని రైల్వేస్టేషన్ ప్రాంగణంలో
సోమవారం ‘రైల్వే కోచ్ రెస్టారెంట్’ను ప్రారంభించారు.
– సిటీబ్యూరో, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : రైల్వే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే జోన్ వినూత్న పద్ధతులకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా నెక్లెస్ రోడ్‌లోని రైల్వేస్టేషన్ ప్రాంగణంలో ‘రైల్వే కోచ్ రెస్టారెంట్’ను సోమవారం రైల్వే అధికారులు ప్రారంభించారు. రెస్టారెంట్ ఆన్ వీల్స్.. పేరుతో రాష్ట్రంలో రెండో రైల్వే కోచ్ రెస్టారెంట్‌ను ప్రారంభించామని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
మెసర్స్ భూమరాంగ్ రెస్టారెంట్ వారికి ఐదేండ్ల కాలం వరకు కేటాయించినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఎస్సీఆర్ జోన్ జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ ప్రత్యేక చొరవతో రైల్వే కోచ్ రెస్టారెంట్ ప్రారంభించినట్లు అధికారులు పేర్కొన్నారు.