అల్వాల్ ఏప్రిల్ 21: పుడ్ సేఫ్టీ ఆఫీసర్లమని చెప్పుకుంటూ దుకాణాలపై దాడులు చేసి అక్రమ వసూళ్లకు పాల్పడిన ఇద్దరు మహిళా నకిలీ అధికారులను అల్వాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఓల్డ్ అల్వాల్ ఐజీ స్టార్చ్ దగ్గర ఓ స్వీట్ హౌస్లోకి ప్రవేశించి తాము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లమని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు.
అనుమానం వచ్చిన స్వీట్ హౌస్ యజమాని స్థానిక ఫుడ్ సేఫ్టీ అధికారి లక్ష్మికాంత్కు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అధికారి వారిని ప్రశ్నించగా తాము ప్రైవేట్ వ్యక్తులమని వేరే సంస్థకు చెందిన వారమంటూ తప్పించుకోవడానికి ప్రయత్నించారు. దీంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా నకిలీ అధికారులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని సీఐ తెలిపారు.