ఢిల్లీ: దేశవాళీల్లో సత్తాచాటిన జమ్మూకాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ భారత జట్టులోకి వచ్చాడు. ఎడమ మోకాలి గాయం కారణంగా లంక పర్యటనకు దూరమైన బుమ్రా స్థానాన్ని ఈ బారాముల్లా పేసర్ భర్తీ చేయనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో జమ్మూకాశ్మీర్ నుంచి భారత జట్టుకు ఎంపికైన మూడో క్రికెటర్ (రసూల్, ఉమ్రాన్)గా నబీ రికార్డులకెక్కాడు. ఆ ఇద్దరూ టీమిండియాకు పరిమిత ఓవర్లలోనే ప్రాతినిథ్యం వహించగా నబీ మాత్రం టెస్టు జట్టుకు ఎంపికైన తొలి పేసర్ కావడం గమనార్హం.
ఫీల్డింగ్ కోచ్గా సుబదీప్ ఘోష్
భారత పురుషుల క్రికెట్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్గా సుబదీప్ ఘోష్ నియమితుడయ్యాడు. గతం లో అసోం, రైల్వేస్కు ఆడిన ఘోష్.. కోచ్గా ఇండియా ‘ఏ’, మహిళల జట్టుకు, నేషనల్ క్రికెట్ అకాడమీలో సేవలందించాడు. లంకతో రెండు టెస్టుల నుంచే టీమిండియాతో అతడి ప్రయాణం మొదలవనుంది.