Ragidi Lakshmareddy | మల్కాజ్‌గిరిలో బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలి
Ragidi Lakshmareddy | మల్కాజ్గిరి(Malkajgiri) పార్లమెంటు స్థానంలో బీఆర్ఎస్ను(BRS) భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి(Ragidi Lakshmareddy) అన్నారు.
ఎల్బీనగర్ , మార్చి 18 : మల్కాజ్గిరి(Malkajgiri) పార్లమెంటు స్థానంలో బీఆర్ఎస్ను(BRS) భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి(Ragidi Lakshmareddy) అన్నారు. సోమవారం కర్మాన్‌ఘాట్ కొత్తకాపు యాదవరెడ్డి గార్డెన్స్‌లో జరిగిన ఎల్బీనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ నగరం ప్రపంచ పటంలో నిలిపిన ఘనత, ఐటీ అభివృద్ధికి కారణం కేసీఆరేనని అన్నారు.కేసీఆర్ హాయాంలో జరిగిన అభివృద్ది కళ్లముందే ఉందన్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడుగా గెల్చిన రేవంత్‌రెడ్డి పార్లమెంటులోని ఏ ఒక్క నియోజకవర్గంలోనూ తిరుగలేదన్నారు.
ఇక బరిలో నిలుస్తున్న మరో వ్యక్తి హుజూరాబాద్ నుండి వచ్చాడని అన్నారు. తాను ఉప్పల్ నియోజకవర్గంలో ఉండే స్థానికుడినని, గెల్చినా స్థానికం గా ఉంటూ ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో సుధీర్‌రెడ్డికి అందించిన మెజార్టీకి రెట్టింపు మెజార్టీని తనకు అందించాలని కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

