అర్ధరాత్రి తనిఖీలు
శాంతి భద్రతల పరిరక్షణ, సిబ్బంది అప్రమత్తతను పరిశీలించడంలో భగంగా సోమవారం అర్ధరాత్రి సమయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ వివిధ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా సందర్శించారు.
- రాచకొండ సీపీ ఆకస్మిక సందర్శనలు
- ఠాణాల్లో సిబ్బందికి పలు సూచనలు
సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): శాంతి భద్రతల పరిరక్షణ, సిబ్బంది అప్రమత్తతను పరిశీలించడంలో భగంగా సోమవారం అర్ధరాత్రి సమయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ వివిధ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా సందర్శించారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాలను అదుపు చేయడంలో సిబ్బంది పని తీరును తెలుసుకుంటూ బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ వాహనాలు, రాత్రి సమయంలో విధులలో ఉన్న సిబ్బందితో మాట్లాడారు. మేడిపల్లి, ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, మీర్‌పేట, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్‌మెట్, సరూర్‌నగర్, చైతన్యపురి పోలీస్స్టేషన్లను కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాత్రి సమయంలో విధుల్లో మరింత శ్రద్ధగా పనిచేయాలని, తద్వారా స్మగ్లింగ్, వివిధ రకాల అసాంఘిక కార్యకలాపాలను అణిచివేయవచ్చన్నారు.
రాత్రి సమయంలో పనిచేసే ఉద్యోగులు, మహిళలు, ఇతరులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూసుకోవాలన్నారు. అత్యవసర సహాయం కోసం వచ్చే ఫోన్ కాల్స్‌కు తక్షణమే స్పందించి, బాధితులకు సత్వర న్యాయం అందించాలన్నారు. విధుల్లో ఉన్న సిబ్బంది సమర్థవంతంగా పనిచేసేలా నిరంతరం ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తుంటారని అధికారులకు సూచించారు. పోలీస్‌స్టేషన్‌కు సంబంధించిన వెహికల్ చెకింగ్ పాయింట్స్‌ను సందర్శించి.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటూ గంజాయి క్రయ, విక్రయాలను పూర్తిస్థాయిలో అరికట్టాలని సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

