జూబ్లీహిల్స్, జూలై 27 : బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు డయల్ 100, 112 కు వచ్చే ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అధికారులను ఆదేశించారు. శనివారం రాచకొండ కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ బృందాల పనితీరుపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ పద్మజ, ఎల్బీ నగర్ డీసీపీ ప్రవీణ్‌కుమార్, యాదాద్రి డీసీపీ రాజేశ్ చంద్ర, ఎస్బీ డీసీపీ కరుణాకర్, డీసీపీ క్రై అరవింద్ బాబు, మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, ఐటీ సెల్ ఏసీపీ నరేందర్ గౌడ్, సీసీఆర్బీ ఏసీపీ రమేశ్, ఎస్బీ ఏసీపీ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.