కాచిగూడ,నవంబర్ 15 : రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లు, ఆర్డీఓ, తహసీల్వార్ కార్యాలయలను(Government offices) ముట్టిడిస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు,మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య(R. Krishnaiah)అన్నారు. శుక్రవారం కాచిగూడ హోటల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర సంక్షోభంలో ఉందని కాంగ్రెస్ పార్టీ అంటున్నది. 11 నెలల పాలనలో లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని, ప్రభుత్వం తీసుకువచ్చిన అప్పులపై దమ్ము, ధైర్యం ఉంటే సీఎం రేవంత్‌రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రూ.4 వేల కోట్ల ఫీజుల బకాయిలు, స్కాలర్ఫిప్లు పెంచాలని తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల16న కలెక్టరేట్లు, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయలను ముట్టడించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల స్కాలర్‌షిఫ్‌లను రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు పెంచాలని, విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మూసీ సుందరీకరణ కాదు..విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడిన గురుకులాల సుందరీకరణ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు.ఈ కార్యక్రమంలో రాష్ట బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ, నీలం వెంకటేశ్, అనంతయ్య, రాజేందర్, నందగోపాల్, రాందేవ్, ఉదయ్, వీరన్న, ఎ.రామకృష్ణ, రవికుమార్, లింగస్వామి,విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.