శేరిలింగంపల్లి, ఏప్రిల్ 15: ఒక్కసారిగా ద్విచక్ర వాహనం లో మంటలు చెలరేగి కొద్దిసేపట్లోనే పూర్తిగా దగ్ధమైంది. వాహనదారుడు అదృష్టవశాత్తు వాహనాన్ని రోడ్డుపైనే వదిలి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ సంఘటన గచ్చిబౌలిలో మంగళవారం చోటుచేసుకుంది. కర్నూల్ నంద్యాల ప్రాంతానికి చెందిన సయ్య ద్ కేపీహెచ్‌బీ కాలనీలో నివాసముంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ప నిచేస్తున్నాడు.
మంగళవారం ఉదయం కేపీహెచ్‌బీ కాలనీలోని ఇంటి నుంచి తన పల్సర్(ఎన్ఎస్ 200)పై కార్యాలయానికి బయలుదేరాడు. మార్గమధ్యలో గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో చేరుకోగానే ఇంజన్ వద్ద ఒక్కసారిగా మంటలు రావడం తో వెంటనే బైక్‌ను ఆపి.. కిందకుదిగాడు. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించి ద్విచక్ర వాహనం పూర్తిగా ఖాళీ బూడిదైంది. సమాచారం అందుకున్న వట్టినాగులపల్లికి చెందిన అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు.