మహానగరంలో ప్రజలకు పాలన చేరువ చేసేందుకు ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాలు 150 డివిజన్లలో ప్రారంభమయ్యాయి. మంత్రి కేటీఆర్ ఆలోచన మేరకు గతంలోనే 137 వార్డు కార్యాలయాల్లో సేవలు మొదలవగా, మిగిలిన 13 డివిజన్లలో వార్డు కార్యాలయాలను బుధవారం ప్రారంభించారు. ప్రతి వార్డులోనూ 10 మంది అధికారులు ఉండి నిత్యం ప్రజా సమస్యలను పరిష్కరిస్తారు. వివిధ విభాగాలకు చెందిన అధికారులు సమస్యల కేటగిరీ, పరిష్కారానికి నిర్ణీత గడువును సూచించే సిటిజన్ చార్ట్ ఆధారంగా పౌరులకు సేవలందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ వార్డు కార్యాలయాలను ప్రజాప్రతినిధులు పండుగ వాతావరణంలో ప్రారంభించారు. సనత్‌నగర్‌లోని రాంగోపాల్ పేట, ముషీరాబాద్‌లోని భోలక్‌పూర్, అంబర్‌పేటలోని తిలక్‌నగర్‌లో ఏర్పాటు చేసిన వార్డు ఆఫీసులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, గోషామహల్‌లోని మూడు చోట్ల హోంమంత్రి మహమూద్ అలీ, ముషీరాబాద్ రాంనగర్లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, ఖైరతాబాద్ చింతల్‌బస్తీ, నాంపల్లి మెహిదీపట్నంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, నాంపల్లిలోని విజయ్‌నగర్ కాలనీ, బజార్‌ఘాట్‌లో ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, అహ్మద్‌నగర్, సాయిబాబా దేవాలయాల వద్ద ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాలను నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్‌లు ప్రారంభించారు.
సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి మరో 13 వార్డు కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి. పాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం..150 డివిజన్లలో పూర్తి స్థాయిలో వార్డు పాలన తీసుకొచ్చింది. నగర పౌరులకు పరిపాలన మరింత చేరువ చేసేలా వార్డుకు 10 మంది చొప్పున 150 వార్డుల్లో 1500 అధికారులు నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉండి..ప్రజా సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపనున్నారు. సమస్యలు ఎంత సమయంలో పరిష్కారం చేయాలనే నిర్ణీత గడువు సూచించే సిటిజన్ చార్ట్‌ను అమలు చేస్తున్నారు.
గ్రేటర్ వ్యాప్తంగా 13 చోట్ల వార్డు కార్యాలయాల ప్రారంభం పండుగ వాతావరణంలో జరిగింది. సనత్‌నగర్‌లోని రాంగోపాల్ పేట, ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలో భోలక్‌పూర్, అంబర్‌పేటలోని తిలక్‌నగర్‌లో ఏర్పాటు చేసిన వార్డు ఆఫీసులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. అలాగే గోషామహల్లో మూడు చోట్ల హోంమంత్రి మహమూద్ అలీ, ముషీరాబాద్ రాంనగర్లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, ఖైరతాబాద్ చింతల్‌బస్తీ, నాంపల్లి మెహిదీపట్నంలో మేయర్ విజయలక్ష్మి, నాంపల్లిలోని విజయ్‌నగర్ కాలనీ, బజార్ఘాట్లలో ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, అహ్మద్‌నగర్, సాయిబాబా దేవాలయాల వద్ద ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాలను నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ ప్రారంభించారు.
సేవలను సద్వినియోగం చేసుకోండి
ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలి, త్వరితగతిన సమస్యలను పరిషరించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వార్డు ఆఫీసులను ఏర్పాటు చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం సనత్‌నగర్, ముషీరాబాద్, అంబర్‌పేట నియోజకవర్గాల పరిధిలో స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి వార్డు ఆఫీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రజలు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన సమస్యల పరిషారం కోసం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదన్నారు. వార్డు ఆఫీస్ వ్యవస్థతో జీహెచ్ఎంసీ, విద్యుత్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, హార్టికల్చర్ తదితర శాఖల అధికారులు అంతా ఒక చోట ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో డివిజన్‌కు ఒకటి చొప్పున గతంలో 137 వార్డు ఆఫీసులను ప్రారంభించామని, మిగిలిన 13 ఆఫీసులను బుధవారం ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి వివరించారు. సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో వార్డు ఆఫీసులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
ఫిర్యాదులను పరిషరించాలి
వార్డు కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదులు సిటిజన్ చార్ట్ ప్రకారం పరిషరించాలని మేయర్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. బుధవారం చింతల్ బస్తీలో ఏర్పాటు చేసిన రెడ్ హిల్స్ వార్డు కార్యాలయంతో పాటు, మెహిదీపట్నం గోషామహల్ వార్డు కార్యాలయాలను మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ… వార్డు కార్యాలయాలకు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, ఇతర శాఖలకు, వార్డుకు సంబంధించిన సమస్యలపై విన్నపాలను స్వీకరించి పరిషారానికి సంబంధించిన శాఖకు లేదా వార్డుకు గానీ సిఫారసు చేయాలని అధికారులను ఆదేశించారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా నగరంలో ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాలపై ప్రజల మంచి స్పందన వస్తోందని మేయర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ వెంకటేశ్ దెత్రె, గోషామహల్ కార్పొరేటర్ లాల్‌సింగ్, డీసీలు తదితరులు పాల్గొన్నారు.