చిక్కడపల్లి, జూలై4: ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రజల్లో ఆందోళన కలిగిస్తోందని పలువురు వక్తలు పేర్కొన్నారు. తెలంగాణ ఓటర్ల హక్కుల వేదిక ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్ఐఆర్ (ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ)పై చర్చా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో అనేక అనుమానాలు, భయాందోళనలు నెలకొన్నాయని తెలిపారు. ఎస్ఐఆర్ అంనతరం పశ్చిబెంగాల్, తమిళనాడు వంటి రాష్ర్టాలో ప్రభుత్వాలు మారిన పరిణామాలను గుర్తుచేశారు.
బీఎల్వోలు తనకు దరఖాస్తు ఫారం ఇచ్చారని అయితే అందులో చిన్న పోరాపాటు జరిగినా ఓటు హక్కు కోత్పోతాననే భయంతో తాను ఇప్పటి వరకు ఆ ఫారం నింపలేదని వివరించారు. భారత రాజ్యాంగం ప్రకారం కులం, మతం, వర్గం అనే తేడాలు లేకుండా ప్రతి పౌరుడికీ ఓటు హక్కు కల్పించాల్సి బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. 1935 కాలంలో బ్రిటిష్ వారికి అనుకూలం గా ఉన్న కొది మందికే ఓటు హక్కు ఉండేదని, ప్రస్తుతం జరుగున్న పరిణామాలు మళ్లీ అలాంటి పరిస్థితులను గుర్తు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు హక్కును కాపాడాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తదితరులు పాల్గొన్నారు.