హైదరాబాద్: యువతను గబ్బు పట్టిస్తున్న పబ్బులు (Pub) కస్టమర్లను ఆకర్షించేందుకు వక్రమార్గాలను అనుసరిస్తున్నాయి. యువతులో అసభ్యకరమైన డ్యాన్సులు వేయిస్తూ తమ పబ్బుకు ఒక్కసారి వచ్చినవారిని మళ్లీ వచ్చేలా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. రోడ్ నంబర్ 4లోని టాస్ పబ్బులో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వాహకులు యువతులతో అసభ్యకర నృత్యాలు చేయిస్తున్నట్లు గుర్తించారు. దీంతో 100 మంది పురుషులు, 42 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.