జగద్గిరిగుట్ట, ఆగస్టు 4 : కుత్బుల్లాపూర్ నియోజక వర్గం సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని సూరారం కాలనీ, కృషి కాలనీ, పూష్పా గిరి, బస్తీ సాయి బాబా నగర్, పాండు బస్తీ, శివహిల్స్, శివాలయనగర్, అల్లూరి సీత రామ రాజు నగర్, వీడీఆర్ కాలనీ, తదితర బస్తీలలో మంజీరా నీరు పది రోజులకోసారి రావడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
సోమవారం స్థానికులతో కలసి బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి జీఎం ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. రెండు రోజులకొకసారి తాగు నీళ్లు వదలకపోతే కుత్బుల్లాపూర్ ప్రజలతో వాటర్ వర్క్స్ ఎండీ ఆఫీస్ ఖైరతాబాద్ వద్ద ధర్నా చేస్తామన్నారు. సమస్య పై
జీ మాధవికి వినతి పత్రం ఇచ్చారు.