సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో శనివారం రాత్రి జరిగిన ఐఏఎస్ బదిలీలలో భాగంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న హరిచందన దాసరిని బదిలీ చేస్తూ ఆమె స్థానంలో డాక్టర్ ప్రియాంక ఆల నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న ప్రియాంక ఆల గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ఈ బదిలీల్లో భాగంగానే జీహెచ్ఎంసీలోని ఐదుజోనల్ కమిషనర్ల బదిలీలు జరిగాయి.
గోల్కొండ జోనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న ముకుందరెడ్డిని బదిలీ చేస్తూ ఆయన స్థానంలో పీ ఉదయ్‌కుమార్‌ను, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న ప్రియాంక ఆల స్థానంలో బదావత్ సంతోష్‌ను, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న భోర్ఖడే హేమంత్ సహదేవ్ స్థానంలో నారాయణ్ అమిత్ మాలెంపాటిని, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న హేమంత కేశవ్‌పాటిల్ స్థానంలో వికాస్మహతోను, కూకట్పల్లి జోనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న అపూర్వ్ చౌహాన్ స్థానంలో మయాంక్సింగ్ను, రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న మందమకరందును బదిలీ చేస్తూ ఆయన స్థానంలో శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.