Mayor Vijayalaxmi | బంజారాహిల్స్ : నగరవాసుల కోసం మరింత మెరుగైన మౌలిక వసతులను కల్పించడమే లక్ష్యంగా రోడ్లు, పార్కుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. బంజారాహిల్స్ డివిజన్ పరిధిలో బుధవారం అభివృద్ధి పనులను మేయర్ ప్రారంభించారు. బంజారాహిల్స్ రోడ్ నెం-13లో రూ.80లక్షల వ్యయంతో చేపట్టిన వీడీసీసీ పనులకు మేయర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రేమ్‌నగర్ పార్కులో మొక్కలు నాటిన మేయర్ మాట్లాడుతూ.. నగరంలోని ప్రధాన రోడ్లతో పాటు అంతర్గత రోడ్లను మెరుగుపరిచేంుదకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, వాటితో పనులను వేగవంతం చేస్తున్నామన్నారు. రోడ్లతో పాటు గ్రీనరీని పెంచేందుక అన్ని కాలనీలు, బస్తీల్లోని పార్కులను అభివృద్ధి చేస్తామన్నారు. నగరాభివృద్ధిలో భాగంగా అన్ని డివిజన్లలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో సర్కిల్ 18డీఎంసీ ప్రశాంతి, ఈఈ విజయ్‌కుమార్, ఏఎంవోహెచ్ భార్గవ్‌నారాయణ పాల్గొన్నారు.