సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ఈఆర్టీ బృందాలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సీవరేజీ ఓవర్‌ఫ్లో సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జీహెచ్ఎంసీ, హైడ్రా గుర్తించిన 141 నీరు నిలిచే హాట్ స్పాట్లను పర్యవేక్షించాలని, ఎక్కడైనా మ్యాన్ హోళ్లు ఉప్పొంగితే వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలన్నారు. ఎక్కడైనా నీరు నిలిచినా, మ్యాన్ హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉన్నా జలమండలి కస్టమర్ కేర్ నెంబర్ 155313కు ఫోన్ చేయాలని సూచించారు.