హైకోర్టును ఆశ్రయించిన ప్రదీప్ కన్స్ట్రక్షన్స్
హుస్సేన్‌సాగర్ ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంకు లెవెల్) పరిధిలో అక్రమ నిర్మాణాల పేరుతో జీహెచ్ఎంసీ ఈ నెల 7న జారీచేసిన షోకాజ్ నోటీసును సవాలు చేస్తూ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ హైకోర్టును ఆశ్రయించింది. సోమాజిగూడ రాజ్‌భవన్ రోడ్డులోని సర్వే నం.22లో అన్ని అనుమతులతో నిర్మించిన బహుళ అంతస్తుల భవనానికి జారీచేసిన షోకాజ్ నోటీసును రద్దు చేయాలని కోరుతూ ప్రదీప్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): హుస్సేన్‌సాగర్ ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంకు లెవెల్) పరిధిలో అక్రమ నిర్మాణాల పేరుతో జీహెచ్ఎంసీ ఈ నెల 7న జారీచేసిన షోకాజ్ నోటీసును సవాలు చేస్తూ ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ హైకోర్టును ఆశ్రయించింది. సోమాజిగూడ రాజ్‌భవన్ రోడ్డులోని సర్వే నం.22లో అన్ని అనుమతులతో నిర్మించిన బహుళ అంతస్తుల భవనానికి జారీచేసిన షోకాజ్ నోటీసును రద్దు చేయాలని కోరుతూ ప్రదీప్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీచేయాల్సిన దశలో మూడో వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా నోటీసు ఇవ్వడం చట్టబద్ధం కాదని పేరొన్నారు.
భవన నిర్మాణం ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో ఉన్నదని నోటీసులో పేరొన్నప్పటికీ, ఇప్పటివరకు హుస్సేన్‌సాగర్ ఎఫ్టీఎల్ నిర్ధారణకు ప్రాథమిక నోటిఫికేషన్ కూడా వెలువడలేదని తెలిపారు. షోకాజ్ నోటీసును రద్దు చేయడంతోపాటు హైడ్రా, ఇతర ప్రభుత్వ సంస్థలు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి కేసు విచారణ నుంచి తప్పుకుంటూ, మరో బెంచ్ ఎదుట విచారణకు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

