Hyderabad | సైదాబాద్, జూన్ 15 : విద్యుత్ మరమ్మతుల కారణంగా ఆస్మాన్‌ఘడ్ సబ్ డివిజన్ పరిధిలో పలు ప్రాంతాల్లో సోమవారం విద్యుత్ సరఫరాను నిలిపి వేస్తున్నట్లు అస్మాన్‌ఘడ్ డీఈ విష్ణువర్ధన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 11కేవీ సింగరేణి కాలనీ, 11కేవీ నూర్ఖాన్ బజార్, 11కేవీ తీగల గూడ, 11కేవీ జవహర్ నగర్, 11కేవీ ఎస్సార్ టీ కాలనీ ఫీడర్ల పరిధిలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 11కేవీ సరస్వతి నగర్, 11కేవీ ప్రశాంత్ నగర్, 11కేవీ వహీద్ నగర్ కాలనీ, 11కేవీ పూలతోట,11కేవీ యాసిన్ జంగ్ మసీద్ ఫీడర్ల పరిధిలో మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఆయా ఫీడర్ల ప్రాంతాలతో పాటు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.