శామీర్‌పేట, మార్చి 16 : విచ్చల విడి కరెంట్ కోతలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అలియాబాద్ సబ్ స్టేషన్ సెక్షన్ పరిధిలోని సబ్ స్టేషన్లలో ఇదే పరిస్థితి కొనసాగడంతో ఆదివారం ఆగమాగంగా గడిచింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపుగా 6 సార్లు 3 గంటల పాటు విద్యుత్ కోతలు విధించారు. ముందస్తు సమాచారం లేకుండా కరెంట్ కట్ చేయడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఏఈ ని వివరణ కోరగా ఇన్ కమ్మింగ్లైన్ కట్ అవ్వడంతో మధ్యాహ్నం 1 గంటల నుంచి 2:36 వరకు మరమ్మతుల కోసం కొంత సమయం విద్యుత్ సరఫరా లో అంతరాయం కలిగిందని తెలిపారు.
విద్యుత్ సరఫరాలో ప్రతి రోజూ కోతలే. ఉదయం 9 గంటల ప్రాంతంలో, మధ్యాహ్నం ఎప్పుడు పడితే అప్పుడే… ఎందుకు కరెంటు తీస్తున్నారో ఎవరికీ తెలియదు. బిల్లులు మాత్రం ముక్కుపిండి వసూలు చేసే కరెంటోళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం విషయం ముందే చెప్పడం తెలియకపోవడం విడ్డురం.
– శ్రీకాంత్, శామీర్‌పేట మండలం.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. కరెంటు కష్టాలను తెచ్చింది. 200 యూనిట్లు ఫ్రీ విద్యుత్ ఏందో కాని ఎప్పుడు చూసినా కరెంటు కోతలే. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రెప్పపాటునా.. కరెంటు పోనియ్యలేదు. కాంగ్రెస్ వచ్చిన నుంచి కరెంటు కష్టాలు మళ్లీ మొదలయ్యాయి.
– ర్యాకల ఆనంద్‌గౌడ్, అలియాబాద్ గ్రామం.