Vattinagulapally | దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నామని వట్టినాగులపల్లి బాధితుడు సతీశ్ షా తెలిపారు. 1968 నుంచి భూములను సాగు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. పొంగులేటి హర్ష రెడ్డి వచ్చి రోడ్డుకు స్థలం ఇవ్వాలని అడిగాడని చెప్పారు. అందుకు నిరాకరించడంతో కొన్ని రోజుల తర్వాత శ్రీనివాస్ రెడ్డి వచ్చారని తెలిపారు. ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా మా భూమి సర్వే చేయించాడని అన్నారు. సర్వే నోటీసులను హైకోర్టు కూడా కొట్టివేసిందని పేర్కొన్నారు. మా మనుషులపై దాడులు చేసి గూండాలు బెదిరించారని తెలిపారు. హైకోర్టుకు వెళ్తే పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని ఆదేశించిందని తెలిపారు.
దీపావళి పండుగ తర్వాత నుంచి చాలా ఆందోళనగా ఉన్నామని వట్టినాగులపల్లి బాధితురాలు పల్లవి షా తెలిపారు. మా భూమి ఇవ్వాలని పొంగులేటి మనుషులు కోరినా నిరాకరించామని పేర్కొన్నారు. మేం 50 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం.. మాకు వేరే జాగా వద్దని అన్నామని చెప్పారు. అక్కడిస్తాం.. ఇక్కడిస్తామని మమ్మల్ని ఎంతో మభ్యపెట్టారని తెలిపారు. కిలోమీటర్ ఉన్న కాంపౌండ్ వాల్‌ను రాత్రికి రాత్రే కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశామని తెలిపారు. అదే రోజు రాత్రి 70 మంది గూండాలు వచ్చి మా గార్డులను బంధించారని వాపోయారు. మొబైల్స్ గుంజుకున్నారు.. తెల్లవారుజాము వరకు నిర్బంధించారని తెలిపారు. ఇక్కడి నుంచి వెళ్లకపోతే నరికిపారేస్తామని బెదిరించారని అన్నారు. మాకు అండగా ఉన్న పోలీసు అధికారిని ట్రాన్స్ఫర్ చేయించారని తెలిపారు. మాకు అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు ఉన్నా కూడా విధ్వంసానికి పాల్పడ్డారని తెలిపారు.
మాకు భూమి ఇవ్వకుంటే మమల్ని ఇక్కడే చంపి సజీవంగా పాతి పెడతామని పొంగులేటి మనుషులు బెదిరించారు
వట్టినాగులపల్లి 300 కోట్ల భూముల కోసం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మనుషులు బెదిరించిన భాగోతం వివరించిన బాధితురాలు పల్లవి షా
దీపావళి నుంచి మేము చాలా భయంతో బతుకుతున్నాం.. మా ఇంటికి వచ్చి… https://t.co/9Vdvss1LMa pic.twitter.com/cxkzoiUNcv
— Telugu Scribe (@TeluguScribe) March 30, 2026