Polytechnic students | స్కిల్ వర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనానికి రేవంత్ రెడ్డి తెచ్చిన శక్తి స్కీమ్(Shakti Scheme), జీవో-97పై విద్యార్థుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే శక్తి స్కీమ్‌ను తొలగించాలంటూ డిమాండ్ చేస్తూ రామంతాపూర్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ (వైఐఎస్ యూ)లో విలీనం చేయడం వల్ల విద్యార్థుల మూడేళ్ల విద్యా వ్యవస్థ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో వేలాది మంది విద్యార్థుల ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.ప్రభుత్వం వెంటనే పునరాలోచించి తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలన్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
హైదరాబాద్ రామంతాపూర్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన
స్కిల్ వర్సిటీలో పాలిటెక్నిక్ కాలేజీల విలీనానికి రేవంత్ రెడ్డి తెచ్చిన శక్తి స్కీమ్‌పై విద్యార్థుల ఆగ్రహం
వెంటనే శక్తి స్కీమ్‌ను తొలగించాలంటూ డిమాండ్
దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ https://t.co/N7wygINzjz pic.twitter.com/vRV9E5L1Va
— Telugu Scribe (@TeluguScribe) August 19, 2026