సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ): పాతకక్షల నేపథ్యంలో ఈ నెల 20న అసిఫ్‌నగర్‌లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. సౌత్‌వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, అసిఫ్‌నగర్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి మంగళవారం ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. కిషన్‌నగర్‌కు చెందిన వసీమ్ అలియాస్ పీఎం అలియాస్యాబా, సమీర్‌ఖాన్ అలియాస్ జునైద్, మహ్మద్ కబూలా అలియాస్ అద్దులు ముగ్గురు స్నేహితులు. వసీమ్, జునైద్‌లు ఫర్నిచర్ వర్క్ చేస్తుండగా, కబూలా సోఫామేకింగ్ చేసేవాడు.
వసీమ్, కబూలా మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కబూలాను మర్డర్ చేయడానికి ఆ ఇద్దరు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 20న నమక్ కార్ఖానాలో మద్యం సేవించిన తర్వాత జునైద్ తన ఫోన్ నుంచి కబూలాకు కాల్ చేసి వసీమ్‌తో వివాదంపై మాట్లాడదామని పిలవగా అందుకు అతడు ఒప్పుకోలేదు. దీంతో ఆ ఇద్దరూ కలిసి కబూలాను వెతుకుతూ కిషన్‌నగర్‌లోని రహత్ హోటల్ దగ్గర ఉన్న చిట్టిగల్లిలో ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్న కబూలాను చూశారు.
ఈ క్రమంలో కబూలాతో జునైద్ మాట్లాడుతూ గొడవకు దిగాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన వసీమ్ కూడా కబూలాతో గొడవ పడుతూ ఒక్కసారిగా కత్తితీసి పొడిచాడు.ఆ తర్వాత అతనితో ఉన్న ఫ్రెండ్స్ పారిపోవడంతో జునైద్ కబూలాను గట్టిగా పట్టుకోగా వసీం అతనిని కత్తితో పలుమార్లు పొడిచాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న గ్రానైట్ రాయిని తీసి కబూలా తలపై వేయడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడని పోలీసులు పేర్కొన్నారు.
పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగిందని, నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు పల్సర్‌బైక్, ఒక ఫోన్ స్వాధీనం చేసుకున్నామని సౌత్‌వెస్ట్‌జోన్ డీసీపీ చంద్రమోహన్, సౌత్‌వెస్ట్ మరియు వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ ఇక్బాల్ సిద్దిఖి తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో అసిఫ్‌నగర్ ఇన్స్పెక్టర్ ఎన్.ఆనంద్, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంతోష్‌కుమార్‌లతో పాటు వారి బృందం చొరవ చూపిందని పోలీసు అధికారులు తెలిపారు.