Shrishti Fertility Center : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ (Universal Shrishti Fertility Center) కేసు దర్యాప్తులో పోలీసులు దూకుడు పెంచారు. సరోగసీ, ఐవీఎఫ్ (కృత్రిమ గర్భధారణ) పేరిట పిల్లల అక్రమ రవాణాకు పాల్పడుతున్న వైద్యురాలు నమ్రత, ఆమె కుమారుడు జయంత్ కృష్టలను కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టును కోరారు. నమ్రత వద్ద సరోగసీ, ఐవీఎఫ్ కోసం వచ్చిన వారి వివరాలు లభ్యమయ్యాయని కోర్టుకు తెలిపిన పోలీసులు.. మరిన్ని విషయాలు రాబట్టేందుకు ఏ1 నమత్ర, ఏ2 జయంత్లను వారం రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేశారు.
పిల్లలు లేని దంపతులకు సరోగసీ ఆశచూపి.. వాళ్ల దగ్గర లక్షల్లో డబ్బులు కాజేసిన నమ్రత అక్రమాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. సరోగసీ కోసం తమ సెంటర్కు వచ్చిన రాజస్థాన్ జంట నుంచి రూ. 50 లక్షలు తీసుకున్న నమ్రత వాళ్లకు మరొక మహిళ బిడ్డను ఇచ్చింది. బిడ్డకు క్యాన్సర్ ఉండడంతో అనుమానం వచ్చి డీఎన్ఏ పరీక్షలు చేయగా.. నమ్రత గుట్టు బయటపడింది.
An illegal surrogacy and sperm racket was uncovered in Regimental Bazaar, Secunderabad, on Saturday, July 26, following which the manager and two lab technicians of Shrishti Fertility Centre were arrested by the police. https://t.co/grL9GBMk29
— The Siasat Daily (@TheSiasatDaily) July 27, 2025
ఇలా తమ సెంటర్కు ఎన్నో ఆశలతో పిల్లల కోసం వచ్చిన వాళ్లను మోసం చేసిన నమత్ర దాదాపు 50 మందితో కాంటాక్టులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాదు ఆమె కోసం పనిచేస్తున్న ఏజెంట్లపైనా నిఘా పెట్టారు. దాంతో, కొద్ది రోజుల్లోనే ఈ కేసుతో ముడిపడి ఉన్న వాళ్ల వివరాలు బయటకు రానున్నాయి.