హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఆర్సీబీ అభిమానులపై పోలీసుల లాఠీలు ఝుళిపించారు. నిన్న గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్స్‌లో ఆర్సీబీ గెలిచిన సందర్భంగా అభిమానులు రోడ్లపై బారికేడ్లను పడేసి బీభత్సం సృష్టించారు. రంగంలోకి దిగిన పోలీసులు అభిమానులపై లాఠీచార్జ్ చేశారు. బెంగళూరు మరోసారి చాంపియన్ అయింది. టోర్నీ ఆరంభం నుంచే అదరగొడుతూ.. లీగ్ టాపర్‌గా నిలిచిన ఆ జట్టునే ఐపీఎల్ కిరీటం వరించింది. తమ మాదిరిగా రెండో ట్రోఫీ వేటలో ఉన్న మాజీ విజేత గుజరాత్ టైటాన్స్ దాని సొంతగడ్డపై చిత్తు చేసింది.
ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ ఫైట్‌లో తమకు మద్దతుగా ఎరుపు వర్ణం జెండాలు, జెర్సీలతో నిండిన నరేంద్ర మోదీ స్టేడియంలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెప్పించిన బెంగళూరు 5 వికెట్ల తేడాతో గుజరాత్‌ను ఓడించి టైటిల్ నిలబెట్టుకుంది. తొలుత రసిఖ్ సలామ్ దార్ (3/27), భువనేశ్వర్ (2/29), హేజిల్‌వుడ్ (2/37) బుల్లెట్లలాంటి బంతులు వేయడంతో గుజరాత్ 20 ఓవర్లలో 155/8 స్కోరు మాత్రమే చేసింది. వాషింగ్టన్ సుందర్ (37 బంతుల్లో 5 ఫోర్లతో 50 నాటౌట్) ఫిఫ్టీతో పోరాడాడు.
అనంతరం కింగ్ కోహ్లీ (42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 75 నాటౌట్) ముందుండి నడిపించడంతో చిన్న లక్ష్యాన్ని ఆర్సీబీ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వెంకటేశ్ అయ్యర్ (16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 32) రాణించాడు. కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
హైదరాబాద్‌లో ఆర్సీబీ అభిమానులపై పోలీసుల లాఠీచార్జ్
ఐపీఎల్ ఫైనల్స్‌లో ఆర్సీబీ గెలిచిన సందర్భంగా రోడ్లపై బారికేడ్లను పడేసి బీభత్సం సృష్టించిన అభిమానులు
దీంతో అభిమానులపై లాఠీచార్జ్ చేసిన పోలీసులు https://t.co/5UNsmr3I5S pic.twitter.com/xGs5rHh3Uq
— Telugu Scribe (@TeluguScribe) June 1, 2026