సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల ప్రవర్తన నియమావళి(Election Code) ఆమలులో భాగంగా గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.25.66 లక్షల నగదు, రూ.56.39 లక్షల విలువ గల ఇతర వస్తువులను సీజ్ చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రోస్ తెలిపారు. 7 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు చెప్పారు.
74 ఆయు లైసెన్స్‌లను డిపాజిట్ చేశారని, 2138 మంది వద్ద లైసెన్స్ ఉన్న ఆయుదాలను డిపాజిట్ చేసినట్లు వివరించారు. 17,112 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకొని సీజ్ చేయగా నలుగురిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఎంసీసీ ఆమలులో భాగంగా ఇప్పటి వరకు 1545 వాల్ రైటింగ్, 5838 పోస్టర్లు, 6937 బ్యానర్లు, 5645 ఇతర మొత్తం 19,997 ప్రైవేట్ ఆస్తులకు సంబంధించి తొలగించినట్లు ఎన్నికల అధికారి చెప్పారు.