CV Anand | సిటీబ్యూరో: పీస్ వెల్ఫేర్ కమిటీల్లో యువతను ప్రోత్సహిస్తూ వారికి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. శుక్రవారం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో అన్ని జోన్లకు నుంచి వచ్చిన సెంట్రల్ పీస్ అండ్ వెల్ఫేర్ కమిటీల సభ్యులతో సమావేశమయ్యారు.
శాంతి భద్రతలను పరిరక్షించేందుకు, స్థానిక పోలీసులకు సహకరించాలని సూచించారు. హైదరాబాద్ ఖ్యాతిని కాపాడేందుకు అవిశ్రాంత కృషిని కొసాగించాలని కమిటీ సభ్యులను సీపీ కోరారు. సమావేశంలో నగర అదనపు సీపీలు విక్రమ్ సింగ్ మాన్, విశ్వప్రసాద్, డీసీపీ చైతన్యకుమార్, స్నేహమెహ్రా పాల్గొన్నారు.