Hyderabad | మొయినాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. పక్కా సమాచారం మేరకు బుధవారం తెల్లవారు జామున సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ ఏడుగురు మహిళలతోపాటు 14 మందిని అరెస్టు చేసింది. పార్టీ జరిగిన స్థలంలో 70 గ్రాముల గంజాయి. మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ముజ్రా పార్టీ జరుగుతుందన్న పక్కా సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు దాడులు జరిపారు. ఏతబర్‌పల్లి శివారులోని హాలీడే ఫామ్‌హౌస్‌లో బర్త్ డే వేడుకల పేరుతో ముజ్రా పార్టీ నిర్వహించారు. నిర్వాహకులు పార్టీ కోసం ముంబయి నుంచి యువతులను మొయినాబాద్‌కు తీసుకువచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇందులో మహారాష్ట్ర, బెంగాల్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులు ఉన్నట్లు సమాచారం. అరెస్టయిన యువతులను రెస్క్యూమ్కు తరలించగా.. యువకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.