అబిడ్స్, జూలై 28 : అక్రమ గ్యాస్ రీ ఫిల్లింగ్ కేంద్రంపై మంగళ్‌హాట్ పోలీసులు దాడులు జరిపి 115 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేశారు.
మంగళ్‌హాట్ ఇన్స్పెక్టర్ ఎన్.రవి తెలిపిన వివరాల ప్రకారం.. ధూల్‌పేట తక్కెర్వాడీలోని ఒక ఇంట్లో అక్రమంగా చిన్న గ్యాస్ సిలిండర్లలో గ్యాస్ రీ ఫిల్లింగ్ చేస్తున్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. నలుగుర్ని అరెస్టు చేసి, సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.