హైదరాబాద్ : పోలీసుల దాడి (Police attack)నుంచి తప్పించుకోబోయే ఓ వ్యక్తి మృతి చెందిన విషాదకర సంఘటన సికింద్రాబాద్లో(Secunderabad) చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..పేకాట స్థావరంపై(Poker camp) టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. భయాందోళనకు గురైన పేకాటరాయుళ్లు తప్పించుకునే క్రమంలో మూడంతస్తుల భవనం పై నుంచి దూకి పారిపోయే ప్రయత్నం చేశారు. బిల్డింగ్ పైనుంచి దూకడంతో వినయ్(35) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.