Hyderabad | కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 20 : కేపీహెచ్బీ కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహాంపై పోలీసులు ఆకస్మికంగా దాడిచేసి… ఇద్దరు వ్యక్తులు, ఓ మహిళను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కేపీహెచ్బీ కాలనీ 2వ రోడ్డులోని ఓ గృహాంలో వ్యభిచారం జరుగుతుందని విశ్వసనీయ సమాచారం అందడంతో బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఆ ఇంటి ముందు ఓ వ్యక్తి అనుమాన్పదంగా కనిపించగా.. గది లోపలికి వెళ్లే సరికి ఓ మహిళ అర్ధనగ్నంగా ఉండగా షేక్ గౌస్ పాషా(29) మరోక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యభిచార గృహాన్ని వ్యక్తి నిర్వహిస్తున్న వ్యక్తి ఒడిశా రాష్ర్టానికి చెందిన మహేశ్వర్ పట్నాయక్ అలియాస్ ప్రియాంకదాస్ (29)గా గుర్తించారు.
ఈ వ్యక్తి చిన్నప్పటి నుంచి మహిళగా మారేందుకు యత్నిస్తున్నాడు. ఒడిశాలో కొన్నాళ్లు గడిపిన మహేశ్వర్ పట్నాయక్.. డబ్బుల కోసం మగ వ్యక్తుల వద్దకు వెళ్లే అలవాటు ఉంది. 6 సంవత్సరాల క్రితం వైజాగ్లో ఓ వ్యక్తిని పెండ్లి చేసుకుని విడాకులు తీసుకున్నాడు. వంట నేర్చుకుని వంటమాస్టర్ అయ్యాడు. ఏడాది క్రితం హైదరాబాద్కు చేరుకుని.. కేపీహెచ్బీ కాలనీలోని ఓ బిర్యానీ సెంటర్లో ఉంటున్నాడు. అతను స్త్రీగా మారడానికి ఎక్కవ డబ్బులు అవసరం కావడంతో సులభంగా డబ్బులను సంపాదించడం కోసం.. ఇంట్లో వ్యభిచారం నిర్వహించడం మొదలుపెట్టాడు. కస్టమర్ల నుంచి… రూ. 2 నుంచి రూ. 3 వేల డబ్బులను తీసుకుని వ్యభిచారం చేసే మహిళలకు రూ. 1000 ఇస్తూ… డబ్బులు సంపాదిస్తున్నాడు. దీంతో ఇద్దరు వ్యక్తులను, ఓ మహిళను అదుపులోకి తీసుకుని వారివద్ద… 3 స్మార్ట్ ఫోన్లు, 15 కండోమ్లు, 1500 నగదును స్వాధీనం చేసుకున్నట్లు చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.