Congress councillor | పేదల భూమిపై కన్నేసి కబ్జా చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్‌పై బాధితులు రోడ్డెక్కి నిరసన బాట పట్టారు. మండుటెండలో పసిపిల్లలతో కలిసి రిలే నిరాహార దీక్ష చేపట్టిన బాధితులపై పోలీసులు కనికరం చూపించకుండా అరెస్ట్ చేశారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో కొల్లాపూర్ మున్సిపాలిటీ 4వ వార్డులో చోటుచేసుకుంది.
కాంగ్రెస్ కౌన్సిలర్, మంత్రి జూపల్లి అనుచరుడు ఎండీ ఖాదర్ పాషా పేదల భూమిపై కన్నేసి కబ్జా చేశాడు. తాము ఎంతో కష్టపడి కొన్న భూమిని ఎండీ ఖాదర్ పాషా కబ్జా చేశారు అంటూ బాధితులు మండుటెండను కూడా లెక్కచేయకుండా తమ పసిపిల్లలతో కలిసి అంబేద్కర్ విగ్రహం ఎదురుగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు. వెంటనే అక్కడకు చేరుకున్న బాధితులను అరెస్ట్ చేశారు. బాధితుల చంకలో ఉన్న పసిపిల్లలు ఏడుస్తున్నా లెక్కచేయకుండా కర్కశంగా వ్యవహరించిన ఖాకీలు చిన్నారులను కూడా వాహనాల్లో ఎక్కించి తీరుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ప్రశ్నిస్తే కాంగ్రెస్ కౌన్సిలర్ ఎండీ ఖాదర్ పాషా అక్రమ కేసులు పెట్టి, మంత్రి జూపల్లి కృష్ణారావు పేరు చెప్పి బాధితులను బ్లాక్మెయిల్ చేస్తున్న తీరు కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యం ఎలా ఉందో మరోసారి రుజువు చేస్తుంది.
నాగర్‌కర్నూల్ జిల్లాలో పోలీసుల దాష్టికం
పేదల భూమిని కబ్జా చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్, మంత్రి జూపల్లి అనుచరుడు యం.డి. ఖాదర్ పాషా
కష్టపడి కొంటే కబ్జా చేశారు అంటూ అంబేద్కర్ విగ్రహం ఎదురుగా బాధితులు రిలే నిరాహార దీక్ష చేపట్టగా వారిని అరెస్ట్ చేసిన పోలీసులు
పసి పిల్లలను సైతం… pic.twitter.com/s8w0OSzPPz
— Telugu Scribe (@TeluguScribe) May 16, 2026