సిటీబ్యూరో, జనవరి 8 (నమస్తే తెలంగాణ): పండుగల సమయంలో ఊళ్లకు వెళ్లే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. రానున్న సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నిఘాతో పాటు రాత్రి సమయాల్లో గస్తీని మరింత పెంచినట్లు సీపీ అవినాశ్ మహంతి వెల్లడించారు. జన సంచారం తక్కువగా ఉండే కాలనీలు, బస్తీలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలిపారు. అయితే ప్రజలు కూడా తమ వంతు జాగ్రత్తలు పాటించాలని సీపీ పలు సూచనలు జారీ చేశారు.