PJR Fans | హైదరాబాద్ : దివంగత మాజీ ఎమ్మెల్యే పీ జనార్ధన్ రెడ్డి నాన్ లోకల్ అంటూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై జూబ్లీహిల్స్ పీజేఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నవీన్ యాదవ్ తక్షణమే క్షమాపణలు చెప్పాలంటూ అభిమానులు డిమాండ్ చేశారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్‌కు కేవలం లోకల్ ఓట్లే కావాలా? నాన్ లోకల్ ఓట్లు అవసరం లేదా? అని నిలదీశారు. పీజేఆర్ లాంటి గొప్ప వ్యక్తిని నాన్ లోకల్ అనడం అక్షేపణీయం అని పేర్కొన్నారు. నవీన్ యాదవ్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పీజేఆర్ అభిమానులు ఒక్క జూబ్లీహిల్స్లోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా ఉన్నారని తెలిపారు. నవీన్ యాదవ్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం సరికాదు. పీజేఆర్ లాంటి ఓ గొప్ప నాయకుడిని ఉద్దేశించి లోకల్, నాన్ లోకల్ అనడం సరికాదు. గుజరాత్‌కు చెందిన మోదీ.. దేశ ప్రధాని ఎలా అయ్యారు..? భారతదేశంలో ఓటరు అయి ఉంటే చాలు ఎక్కడైనా నిలబడొచ్చు. లోకల్, నాన్ లోకల్ అన్న పదాలను నవీన్ యాదవ్ తక్షణమే ఉపసంహరించుకోవాలని పీజేఆర్ అభిమానులు డిమాండ్ చేశారు.
PJR నాన్ లోకల్ అంటూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చేసిన కామెంట్స్‌పై జూబ్లీహిల్స్ PJR అభిమానులు ఆగ్రహం
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్‌కు కేవలం లోకల్ ఓట్లే కావాలా? నాన్ లోకల్ ఓట్లు అవసరం లేదా?
PJR లాంటి గొప్ప వ్యక్తిని నాన్ లోకల్ అనడం అక్షేపణీయం
రాహుల్ గాంధీ యూపీకి చెందిన… pic.twitter.com/i1G3DeMo7t
— Telugu Scribe (@TeluguScribe) October 10, 2025