Air India : ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయల్దేరిన విమానానికి బాంబు బెదిరింపు (Bomb Threat) తీవ్ర కలలకం రేపింది. శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయానికి బయల్దేరిని ఎయిరిండియా (Air India) ఫ్లట్లో బాంబు ఉందని బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. దాంతో.. ప్రయాణికులు కంగారు పడిపోయారు. అయితే.. శంషాబాద్‌లో విమానాన్ని పైలట్ సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
బాంబు బెదిరింపు నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయం అధికారులు అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక కేంద్రాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలను అందుబాటులో ఉంచారు. బాంబ్ ఈమెయిల్ వచ్చినా పైలట్ ఏమాత్రం టెన్షన్ పడకుండా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. మిగతా విమానలకు దూరంగా ఫ్లయిట్‌ను ల్యాండ్ చేయగా.. బాంబు స్క్వాడ్లతో ప్రయాణికులను తనిఖీ చేశారు సిబ్బంది. వీరితో పాటు సీఐఎస్ఎఫ్ సిబ్బంది కూడా సోదాలు చేశారు. ప్రయాణికులను దింపిసే విమానాన్ని ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు.