ఖైరతాబాద్, ఫిబ్రవరి 10 : చిందు వర్గాన్ని ఎస్సీ గ్రూప్-1లో చేర్చి, వర్గీకరణ శాతం పెంచాలని ఎస్సీ అనుబంధ 57 కులాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్, చిందు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పిల్లుట్ల పశుపతి కోరారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చిందు కులస్తులు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వెనుకబాటు తనానికి గురయ్యారని తెలిపారు. గత ప్రభుత్వాలు తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మాదిగ ఉపకులాల్లో అత్యంత వెనుకబడిన చిందులకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని పశుపతి కోరారు. అలాగే ఉప కులాలకు ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో చిందు యక్షగాన కళాకారులకు ఆదరణ లేక విద్యా, ఉద్యోగ అవకాశాలు లేక జీవితాలు దుర్బరంగా వెల్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిందు యక్షగాన కళాకారుల కళను గుర్తించి వారికి తగిన విధంగా సహయసహకారాలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో గడ్డం రాజు చిందు, పిల్లుట్ల శేషాద్రి చిందు , కోల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.