ఫుట్‌పాత్ ఇలా.. నడిచేదెలా?
నగరంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన బంజారాహిల్స్‌లోని కేబీఆర్ నేషనల్ పార్కు వద్ద రోడ్డు పక్కన ఫుట్‌పాత్ నిర్వహణపై జీహెచ్ఎంసీ తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తుండటంతో వాకర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
- కేబీఆర్ వద్ద ఫుట్‌పాత్‌పై మట్టికుప్పలు
- వాకర్స్, సందర్శకులకు తప్పని ఇబ్బందులు
బంజారాహిల్స్, జూన్ 30 : నగరంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన బంజారాహిల్స్‌లోని కేబీఆర్ నేషనల్ పార్కు వద్ద రోడ్డు పక్కన ఫుట్‌పాత్ నిర్వహణపై జీహెచ్ఎంసీ తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తుండటంతో వాకర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కేబీఆర్ పార్కు మెయిన్ గేట్ నుంచి చెక్‌పోస్ట్ వైపు వెళ్లేరోడ్డుపై హెచ్సిటీ ప్రాజెక్ట్ పనులు చేస్తున్న నేపథ్యంలో ఇటీవల ఫుట్‌పాత్‌లో 70శాతం తొలగించి రోడ్డువేశారు.
మిగిలిన 30శాతం ఫుట్‌పాత్‌ను పాదచారుల కోసం వదిలిపెట్టారు. అయితే రోడ్డు కోసం తవ్వకాలు జరిపిన గుత్తేదార్లు మట్టిని మొత్తం ఫుట్‌పాత్ మీద గుట్టలుగా పోయడంతో పాదచారులు నడిచేందుకు వీల్లేకుండా పోయింది. దీనికితోడు పార్కు మెయిన్ గేట్ సమీపంలో ఉన్న ఫుట్‌పాత్‌పై ఫ్లెక్సీలు, హోర్డింగ్‌ల కోసం ఏర్పాటు చేసిన కర్రలు అడ్డదిడ్డంగా ఉండటంతో నడుచుకుంటూ వెళ్లేవారికి ప్రమాదం పొంచి ఉంది.
మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ వద్ద ఏడాది క్రితం నిర్మించిన ఫుట్‌పాత్‌ను తవ్వేసి రోడ్డు వేయడంతో పాదచారులు ఇబ్బందికి గురవుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కేబీఆర్ పార్కు సమీపంలో ఉన్న ఫుట్‌పాత్‌ల నిర్వహణపై దృష్టి పెట్టి.. సమస్య పరిష్కరించాలని వాకర్లు, సందర్శకులు కోరుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

