ఖైరతాబాద్, మే 28 : అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ స్థానాల్లో మాదిగలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కనీసం మంత్రివర్గంలో అయినా చోటు కల్పించాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలోనే మెజార్టీగా ఉన్న మాదిగలకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మోసం చేస్తూనే ఉందని పిడమర్తి రవి అన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చలేదని, చివరకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. మంత్రి వర్గ విస్తరణలో మాదిగలకు మంత్రి పదవి ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీకి ఆ వర్గం దూరమవుతుందని అన్నారు.