తెలంగాణ భవన్లో రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు.
అనంతరం అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య భార్య సరస్వతి చేతులమీదుగా ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించి ఫొటోలన్నింటినీ తిలకించారు. తెలంగాణ ఉద్యమం, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.