మండలంలోని తాటిపర్తి గ్రామంలో ఆదివారం తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీపీజేఏసీ) కో-కన్వీనర్ కన్నెగంటి రవి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగింది. దీనికి మండలంలోని ఫార్మా బాధిత గ్రామాలైన మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కురుమిద్ద గ్రామాలకు చెం దిన బాధిత రైతులు, కూలీలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామంలోని నాయకులు, రైతులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ భారీ ర్యా లీ తీసి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం గ్రామపంచాయతీ వద్ద ప్రజాభిప్రాయ సేకరణలో మానవ హక్కుల వేదిక నాయకుడు జీవన్‌కుమార్, తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది రఘు, సీనియర్ జర్నలిస్టు వసంతకుమారి, శాతనవాహన, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీల ప్రొఫెసర్లు సుజాత సూరెపల్లి, విజయ్, రిటైర్డ్ తహసీల్దార్ బాలరాజులు పాల్గొ ని ఫార్మా బాధిత రైతుల అభిప్రాయాలను సేకరించారు.
యాచారం, జూలై 5 :భూసేకరణలో జరుగుతున్న అక్రమాలు, దౌర్జన్యాలపై రైతులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. మాకు భూములే కావాలి.. ఫ్యూచర్‌సిటీ వద్దని రైతులు మూకుమ్మడిగా నినదించారు. భూములను కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడాన్ని తప్పు బట్టారు. ఫార్మాసిటీకి ఇవ్వని భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి, ఆన్లైన్లో తమ పేర్లను ఎంట్రీ చేయాలని రైతు గణేశ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఫ్యూచర్‌సిటీకి భూములు తీసుకోవడంతో రైతుకూలీలు ఉపాధిలేక ఆగమయ్యారని.. వారికి ఉపా ధి కల్పించాలన్నారు. నాడు రైతులతో కలిసి ఫార్మాసిటీకి వ్యతిరేకంగా పాదయాత్రలు చేసిన కాంగ్రెస్ నాయకులు నేడు ఎక్కడికెళ్లారని రైతు శ్రీకాంత్‌నాయక్ మండిపడ్డారు. పదవులు రాగానే మమ్మ ల్ని విస్మరించారన్నాడు. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు భూములను తీసుకోవద్దని గిరిజన రైతులు రెండు నెలలుగా రిలే దీక్షలు చేస్తున్నా కాంగ్రెస్ నాయకులు పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ ప్రభు త్వం రైతులను నమ్మించి మోసం చేసిందని రైతు అచ్చిరెడ్డి విమర్శించారు. రానున్న రోజుల్లో రైతులే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రైతులు తమ భూములను అమ్ముకునేలా రిజిస్ట్రేషన్ సౌలభ్యాన్ని కల్పించాలని వినోద్‌రెడ్డి కోరారు. రైతులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్‌ను రానున్న ఎన్నికల్లో ఓడించాలని కుందారపు నారాయణ పిలుపునిచ్చారు. రైతుల పొట్టగొట్టి రియల్ వ్యాపారం చేసేందుకు ప్రభుత్వానికి సిగ్గుండాలని సామ నిరంజన్ మండిపడ్డారు. గ్రీన్‌ఫీల్డ్ రోడ్డుకు తమ పట్టా భూములను ఇచ్చేదిలేదని మర్లకుంటతండా, మంగలిగడ్డతండా, పోతుబండతండా గిరిజనులు మూకుమ్మడిగా తేల్చిచెప్పారు. రైతులకు ఫార్మా ప్లాట్ల డాక్యుమెం ట్లు వెంటనే ఇవ్వాలని సీపీఎం నాయకుడు నరసింహ డిమాండ్ చేశారు. మాకు ఫ్యూచర్‌సిటీ వద్దని మా భూములు మా గ్గావాలని నాలుగు గ్రామాల రైతులు ముక్తకంఠంతో తెలిపారు. పంటలను ధ్వంసం చేస్తే అధికారులు, పోలీసులను తరిమి కొడతామన్నారు.
కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి హాజరై రైతుల సమస్యలు విన్నారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయా గ్రామా ల సర్పంచ్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కండ్లు తెరిపించేందు కే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు కన్నెగంటి రవి తెలిపా రు. రైతులకు న్యాయం చేసేందుకు ప్రతి ఒక్కరం కలిసి కట్టుగా పోరాడుతామని స్పష్టం చేశారు. జ్యూరీ సభ్యులు రైతులు, కూలీలు, నాయకులు చెప్పిన మాటల్ని రిపోర్టు చేసుకున్నారు. ఇక్కడ రైతులకు జరుగుతున్న అన్యాయంపై పూర్తి స్థాయి నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. కార్యక్రమంలో ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీనేత కవుల సరస్వతి, సర్పంచ్‌లు శ్రీవిద్య, ఝాన్సీ, చైత న్య, రైతులు, కూలీలు పాల్గొన్నారు.