జవహర్‌నగర్, నవంబర్ 2: చెట్టు కొమ్మలు కొడుతుండగా… ప్రమాదవశాత్తు కొమ్మలు మీదపడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి.. బిట్స్‌పిలానీ క్యాంపస్‌లో చోటుచేసుకుంది. ఎస్‌హెచ్‌వో సైదయ్య కథనం ప్రకారం… తూముకుంట మున్సిపాలిటీలో కొప్పిశెట్టి పట్టాభి రామయ్య, భార్య ఝాన్సీ, పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు.
పట్టాభి రామయ్య(36) జవహర్‌నగర్ కార్పొరేషన్‌లోని బిట్స్ పిలానీ క్యాంపస్‌లో ఆక్యుపేషన్ గార్డెన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం ఉదయం విధులకు వెళ్లిన పట్టాభిరామయ్య సాయంత్రానికి ఇంటికి రాలేదు. దీంతో భార్య ఝాన్సీ పట్టాభిరామయ్యతో పాటు మంగాయమ్మ కూడా అతడి బైక్‌పై నిత్యం పనికి వెళ్లేది. పట్టాభి రామయ్య కోసం ఆమెను సంప్రదించగా తనకు తెలియదని చెప్పింది.
అతడికి ఫోన్ చేయగా ఎంతకు స్పందించకపోవడంతో వెంటనే బిట్స్పిలానీలోని డీ బ్లాక్ వద్దకు వెళ్లి చూడగా చెట్టు కొమ్మలు మీద పడి తలకు గాయాలతో కనిపించాడు. వెంటనే పట్టాభిరామయ్యను మేడ్చల్‌లోని మెడిసిటీ హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఈ మేరకు భార్య ఝాన్సీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేసున్నారు.